Minister Adluri Laxman Kumar | ధర్మారం,అక్టోబర్ 19: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామం కుమ్మర (శాలివాహన) సంఘ భవనం మంజూరు చేయాలని సంఘ నాయకులు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శాలివాహన యూత్ ఆధ్వర్యంలో ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఆదివారం వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి భన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వారు మంత్రిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఆవునూరి ఆమురయ్య, లచ్చయ్య, తిరుపతి, ఎల్లయ్య యూత్ అధ్యక్షులు ఆవునూరి కిరణ్, ఉపాధ్యక్షులు అంజయ్య, క్యాషియర్ సాయికిరణ్, సలహాదారు హరీష్ సభ్యులు ప్రశాంత్, అజయ్, రాజ్ కుమార్, శ్రీకాంత్, నవీన్, మహేష్, వంశీ, అనిల్, మోదునూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.