Telangana activists | జగిత్యాల రూరల్, మే 30 : తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిశీలించాలని రాష్ట్ర అధ్యకుడు బీమా శ్రీనివాస రావు పిలుపు మేరకు జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్యర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు జవ్వాజి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి ఉద్యమకారునికి 200గజాల ఇంటి స్థలం, గుర్తిపు కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం కార్యక్రమాలలో తగిన ప్రాధాన్యత ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో జూన్ 2 నుండి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి భారతపు లింగారెడ్డి, ఉపాధ్యకులు రాగుల రాజు, తన్నీరు సత్యం రావు, నియోజక వర్గం ఇంచార్జీ కొండ్ర ప్రేమ్ కుమార్, కార్యదర్శి అరుముల్ల ఉపేందర్ తడతరులు పాల్గొన్నారు.