Korutla Bar Association | కోరుట్ల, జూన్ 17: జగిత్యాల జిల్లా న్యాయమూర్తి రత్న ప్రభావతిని కోరుట్ల బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ శివారులోని పెద్ద గుండు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కోరుట్ల కోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పనులను పరిశీలించేందుకు రావాలని న్యాయమూర్తిని ఆహ్వానించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరి విజయ్ కుమార్ తెలిపారు.
కోరుట్ల కోర్టులో స్టాప్ కొరత ఉందని, కోర్టు హాల్లో న్యాయవాదులకు కావలసిన సౌకర్యాలు ఇతర సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి సుతారి నవీన్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ కడకుంట్ల సదాశివరాజు తదితరులు పాల్గొన్నారు.