TNGOS | కలెక్టర్ చిత్రామిశ్రాను కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు
కరీంనగర్ జిల్లా బాస్ గా బాధ్యతలు చేపట్టి, విధులు నిర్వహిస్తున్న కలెక్టర్ చిత్రామిశ్రాను పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
TNGOS | కలెక్టరేట్, మార్చి 2 : కరీంనగర్ జిల్లా బాస్ గా బాధ్యతలు చేపట్టి, విధులు నిర్వహిస్తున్న కలెక్టర్ చిత్రామిశ్రాను పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి, స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యోగులమంతా కలిసికట్టుగా విధులు నిర్వహిస్తూ, జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్‌కు టీఎన్జీవోల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 డైరీని అందజేశారు. మార్చి 7న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని మంకమ్మతోటలో గల టీఎన్జీవోల సంఘం భవనంలో మహిళా ఉద్యోగుల కోసం నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరుకావాలని, మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని కోరారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం సహకరిస్తుందన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘం ప్రతినిధులు సంగెం లక్ష్మణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్, అసోసియేట్ అధ్యక్షుడు ఒంటెల రవీందర్‌రెడ్డి, కోశాధికారి ముప్పిడి కిరణ్ుమార్రెడ్డి, రాష్ట్ర నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మిందర్‌సింగ్, శారద, సునీత, సబిత, మారుపాక రాజేశ్, భరద్వాజ్, వెలిచాల సుమంతరావు, కోడూరి వాస్తవిక్, కొమ్మెర శ్రీనివాస్ డ్డి, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆసంఘ ప్రతినిధులు కోట రామస్వామి, వడ్లకొండ శంకరయ్య, ఎం శ్రీనివాస్, కొమురయ్య, వికలాంగుల ఎన్టీవోల సంఘం ప్రతినిధులు వెన్న శ్రీనివాస్ తో పాటు పలువురు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు, పూలమొక్కలు అందజేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

