గంగాధర, మార్చి 25: పేద ప్రజలకు కంటిచూపును ఇవ్వడమే బీసీఎం లక్ష్యంగా కొదుపాక బుచ్చమ్మ చంద్రమౌళి మెమోరియల్ ట్రస్ట్ కంటి దావాఖాన పని చేస్తోందని సర్పంచ్ రెండ్ల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొండన్నపల్లిలో బుధవారం బీసీఎం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా దవాఖాన వైద్యులు గ్రామస్తులకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఆపరేషన్ అవసరం ఉన్నవారిని హాస్పిటల్కు రిఫర్ చేశారు.
అనంతరం సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కొదురుపాక బీసీఎం కంటి దవాఖాన వారు ప్రతి బుధవారం గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, కంటి పరీక్షలు చేయడం అభినందనీయమన్నారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం పేద ప్రజలకు గొప్ప వరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీఎం వ్యవస్థాపకురాలు, ప్రముఖ కంటి వైద్య నింపునురాలు డాక్టర్ రీటా బహదూర్ షా, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు
పాల్గొన్నారు.