Bathikapalli | పెగడపల్లి: పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామంలో మత సామరస్యం వెల్లువిరిసింది. గ్రామానికి చెందిన ముస్లీం యువకుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ షకీల్ హైదర్ గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాతకు ఆదివారం పట్టు వస్త్రాలు అందజేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి నాగరాజు శ్రీనివాసా చార్య దుర్గామాత ప్రసాదాన్ని షేక్ హైదర్ కు అందజేశారు.
ప్రతీ సంవత్సరం దుర్గామాతకు పట్టు వస్త్రాలు అందజేస్తున్నట్లు షేక్ హైదర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పొనగంటి రాజయ్య, ప్రవీణ్ కుమార్, శ్యామ్, కర్ణాకర్, తరుణ్, మధు, సాయిచంద్, హర్షిత్, రాజయ్య, అరుణ్, వంశీ, ఐశ్వర్య, స్వాతి తదితరులున్నారు.