రాంనగర్, ఫిబ్రవరి 5 : ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకులు బుధవారం అడిషనల్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. మూ డు రో జుల క్రితం వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీసీ గర్జన పేరిట నిర్వహించిన సభలో రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడారు. కొంతకాలంగా టీవీ కార్యక్రమాల్లో సామాజిక మాధ్యమాల్లో పలు స మావేశాల్లో రెడ్డి సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న అనుచత వ్యాఖ్యలు చేశా రు. గ్రామాల్లో అన్నికులాల్లో ఎలాంటి తారతమ్యం లేకుండా కలిసిమెలిసి జీవించే ప్రజల మధ్య తన రాజకీయ లబ్ధి కోసం అ నుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
రామడుగు, ఫిబ్రవరి 5 : మండలంలోని మండలం గోపాల్రావుపేట శ్రీ వీరాంజనేయ రెడ్డి సంక్షేమసంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘం నాయకులు తీర్మార్ మల్లన్నపై ఎస్సై శేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ రెడ్డిసంఘం ప్రధాన కార్యదర్శి కర్ర విద్యాసాగర్‌రెడ్డి, కోశాధికారి చాడ దామోదర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి నర్సింహారెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, కర్ర అశోక్‌రెడ్డి, ఎడవెల్లి మల్లారెడ్డి, నారాయణరెడ్డి, ఎడవెల్లి మహిపాల్‌రెడ్డి, హన్మతరెడ్డి ఉన్నారు.
చిగురుమామిడి, ఫిబ్రవరి 5 : తీన్మార్ మల్లన్న వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని మండల ఓసి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడు తూ, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్న సందర్భంలో కులాల మధ్య చిచ్చుపెట్టి అశాంతి నెలకొల్పుతున్న తీన్మార్ మల్లన్న బహిరం గ క్షమాపణ చెప్పాలన్నా రు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓసి నాయకులు జంగ రమణారెడ్డి, చిట్టిమల్ల రవీందర్, చిట్టిమల్ల శ్రీనివాస్, గంగు నాగేంద్ర శర్మ, కాటం సంపత్ రెడ్డి, నాగేల్లి రాజిరెడ్డి, పోటు మల్లారెడ్డి, కలువల రాజేశ్వర్ రెడ్డి, రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, అంజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, సంపత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, రతన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, శంకర్ రెడ్డి, లచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సందీప్ రెడ్డి ఉన్నారు.