TBGKS | యైటింక్లెయిన్ కాలనీ, డిసెంబర్ 26 : సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నికలలో ఏఐటీయూసీ 47 హామీలు ఇచ్చి, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ 6 గ్యారంటీలు, 39 హామీలు మేనిఫెస్టోలో పెట్టి కార్మిక వర్గానికి తప్పనిసరిగా అమలు చేస్తామని, మభ్యపెట్టి, గెలిచిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదని టీబీజీకే అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. వకీల్ పల్లి గనిపై యూనియన్ ఆర్జీ-2 ఉపాధ్యక్షుడు ఆయిలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. గతంలో ఉన్న హక్కులు కూడా పోయే పరిస్థితులు కల్పించడం జరిగిందని, గత తొమ్మిది నెలలుగా ఒక్క మెడికల్ బోర్డు కూడా నిర్వహించిన పాపాన పోలేదన్నారు. పారదర్శకంగా 100శాతం మెడికల్ ఇన్వాల్యుయేషన్ తో ప్రతీనెల రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని చెప్పి 24 నెలలు దాటినా 5 మెడికల్ బోర్డు నిర్వహించడం జరిగిందని, అందులో కూడా 60 శాతం దాటలేదని మండిపడ్డారు.
కార్మికులకు వ్యతిరేకంగా ఆరు సర్క్యులర్లు వచ్చిన వాటికి వ్యతిరేకంగా పోరాడింది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఆత్మగౌరవానికి సంబంధించిన సింగరేణి డే వేడుకలు నిర్వహణలో కూడా అలసత్వానికి కారణమైనారని, ఇటువంటి సంఘాలు కార్మికులకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు సృష్టించినారని అన్నారు. గత గుర్తింపు కార్మిక సంఘంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 70 కి పైగా హక్కులను సింగరేణి కార్మిక వర్గానికి సాధించామని, కోల్ ఇండియాలో లేని విధంగా 18 రకాల అదనపు హక్కులను కూడా తీసుకువచ్చామని గుర్తు చేశారు.
కారుణ్య నియామకాల ద్వారా 14,000 మంది ఉద్యోగాలు పొందడం జాతీయ కార్మిక సంఘాల ద్వారా పెండింగ్ లో ఉన్న 3400 మందికి ఒకే దఫా ఉద్యోగాలు ఇప్పించడం ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 4200 మందికి ఉద్యోగాలు ఇవ్వడం మొత్తంగా 21600 ఉద్యోగాలు కల్పించడం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు కార్మిక సంఘంగా సాధించిందని, తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, 1శాతం విద్యుత్ చార్జీలు ఎత్తివేత, ఏసీలకు ఉచిత విద్యుత్తు, రూ.10 లక్షల ఇంటి రుణానికి వడ్డీ మాఫీ, రెండు అదనపు పీహెచ్డీలు, ఇలా ఎన్నో రకాల హక్కులను సాధించిన చరిత్ర తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మాత్రమే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల నుండి 50 మంది నాయకులు కార్యకర్తలు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో చేరారు
చేరిన వారిలో అరవింద్ సాయిరాం, నాగరాజు సాయి కృష్ణ, రాజేందర్, శ్రీకాంత్,,వినోద్, పి రవీందర్, శ్రీధర్, ఇమ్రాన్ పాషా, అజర్, రవీందర్, మధుకర్, కుమార్, ప్రదీప్, రామకృష్ణ, ఓంకార్, మల్లేష్, రమేష్, మహర్షి,రావెల్లి శ్రీనివాస్, మనోజ్, సురేష్, మురళి, నరేందర్, అజయ్, రాకేష్, పల్లె నరేష్, మహేష్, సతీష్ తో పాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు చెరుకు ప్రభాకర్ రెడ్డి, బేతి చంద్రయ్య, పిట్ కార్యదర్శి వెంకటేశం, రవితేజ, మామిడి తిరుపతి ,హరి ప్రసాద్, దాసరి శ్రీనివాస్, నరేష్ ,చౌడ శ్రీనివాస్, వెంకటస్వామి,, రాజారాం సురేందర్, మల్లేష్ నాయక్, రాజమౌళి, ఆవుల రాములు, సిరిశెట్టి రాములు, రాజు ,శ్రీనివాస్, గంగాధర్, రామ్ చరణ్, బిక్షపతి, నాగేష్, రంజిత్, రమేష్, వినోద్, అజయ్, రాజ్ కుమార్, రాజ్ కిరణ్, కార్తీక్, రాజేష్, తిరుమల్, వెంకటేశ్వర్లు, కన్నా రెడ్డి, కార్మికులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.