హైదరాబాద్‌లో రవీందర్‌సింగ్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి గంగుల, చిత్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్
రాష్ట్ర సివిల్ సప్ల్లయీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా సర్దార్ రవీందర్‌సింగ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కార్యాలయంలో రిజిస్టర్లో సంతకం చేసి పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అభినందనలు తెలిపారు. వీరితోపాటు బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ శుభాకాంక్షలు తెలిపారు.
– కార్పొరేషన్, డిసెంబర్ 21