Korutla | కోరుట్ల, జూన్ 27: కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా రవీందర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెక్రెటరియేట్లో విధులు నిర్వహించిన రవీందర్ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా పదోన్నతిపై వచ్చారు. అంతకుముందు ఇక్కడ పని చేసిన కమిషనర్ మారుతి ప్రసాద్ సీడీఎంఏకు పదోన్నతిపై బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ ను మున్సిపల్ అధికారులు, సిబ్బంది శాలువా, పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.