Huzurabad | హుజూరాబాద్ టౌన్, మే 30 : రాణి అహిల్యా భాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు హుజూరాబాద్ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో హారతి కార్యక్రమం నిర్వహించి, పురోహితులను సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లోకమాత దేవి అహిల్యాబాయి హోల్కర్ విదేశీ పాలకుల చేతిలో ధ్వంసమైన 82 దేవాలయాలను పునర్నిర్మించారని, ఆమె గొప్ప పరిపాలనదక్షురాలితో పాటు గొప్ప దైవ భక్తురాలని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమం లో నాయకులు వడ్నాల చంద్రిక, చిదురాల రాణి, గంగిశెట్టి ప్రభాకర్, గంగిశెట్టి రాజు, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, ఎంసాని శశిధర్, బోరగాల సారయ్య, పోతుల సంజీవ్, వడ్నాల విజయ్, కొలి పాక వెంకటేష్, పవన్ కుమార్, క్యాస వెంకటేష్, కాపర్తి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.