Unanimous | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 8 : పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీలకు మూడు విడుతలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మండలంలోని రాంపల్లిలో సర్పంచ్ తో సహా 8 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్ స్థానానికి కోదాటి దేవేందర్ రావు, కనపర్తి సంపత్ రావులు తమ నామినేషన్ లను దాఖలు చేయగా గత రెండు రోజులుగా గ్రామ ముఖ్యులు, వెలమసంఘం నాయకులు, మాజీ ప్రజాప్పతినిధులు చేసిన ఏకగ్రీవ ఎన్నిక ప్రయత్నాలు ఫలించి ఆదివారం సర్పంచ్ గా కోదాటి దేవేందర్ రావు తన నామినేషన్ ను ఉపసంహరించుకోగా కనపర్తి సంపత్ రావు ఒక్కరే ఉండడంతో సర్పంచ్ గిరి ఏకగ్రీవం అయింది.
అలాగే అదే విదంగా పట్టుసడలకుండా చేసిన ఏకగ్రీవ ప్రయత్నాలు ఫలించి గ్రామపంచాయతీ 8 వార్డు స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన అభ్యర్థులను మంగళవారం నామినేషన్ ల ఉపసంహరణ అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామ సర్పంచ్ గా కనపర్తి సంపత్ రావు ఆదివారం ఏకగ్రీవం కాగా గ్రామంలోని 1వ వార్డు జనగామ శ్రీనివాస్, 2 వ వార్డు కనికిరెడ్డి స్వరూప, 3 వ వార్డు బొంకూరి దుర్గయ్య, 4 వ వార్డు సుద్దాల విజయ, 5 వ వార్డు బొంగాని రమేష్, 6 వ వార్డు మడుపు జయలక్ష్మి, 7వ కన్నం సంధ్య, 8 వ వార్డు కనుకుంట్ల అంజయ్యతో గ్రామపంచాయతీ పాలకవర్గ 8 స్థానాలు సైతం సోమవారం ఏకగ్రీవమయ్యాయి. మంగళవారం నామినేషన్ ల ఉపసంహరణ గడువు అనంతం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.