Godavarikhani | రామగుండానికి ఎండ దగడు.. అడుగు బయట పెడితే అగ్గే..
రామగుండం అగ్నిగుండంగా మారింది. అడుగు బయట పెడదామంటే అగ్గిలా మండుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఎండ దగడు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రామగుండంలో గడిచిన నాలుగు రోజులు ఈ ప్రతికూల వేడి వాతావరణం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 17 : రామగుండం అగ్నిగుండంగా మారింది. అడుగు బయట పెడదామంటే అగ్గిలా మండుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఎండ దగడు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రామగుండంలో గడిచిన నాలుగు రోజులు ఈ ప్రతికూల వేడి వాతావరణం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. శుక్రవారం గరిష్టంగా 40 డిగ్రీలు దాటడంతో వడగాలులు.. ఉక్క పోత తో ప్రజలు బెంబేలెత్తిపోయారు.
సాయంత్రం 6 దాటినా దగడు తగ్గడం లేదు. వృద్ధులే కాదు యువకులు సైతం.. ఎండకు తట్టుకోలేక అస్వస్థతకు గురవుతున్నారు. వారం రోజుల కిందట గోదావరిఖని జీఎం కాలనీకి ఎల్ఐసీ ఏజెంట్ శ్రీనివాస్ అనే వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందిన సంఘటన విధితమే. అయితే అనూహ్యంగా వాతావరణం లో రోజురోజుకు వేడి తీవ్రత పెరుగుతుండడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కూలర్లు, ఫ్యాన్ల ముందు కూర్చున్నా వేడి నుంచి ఉపశమనం కలగడం లేదు. వివిధ భారీ పరిశ్రమలకు నిలయంగా ఉన్న రామగుండంలో ప్రతీ ఎండాకాలం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం సాధారణమే అయినప్పటికీ… ప్రస్తుత ప్రతికూల పరిస్థితి ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ ప్రమాదకరమైన ఎండల కు ప్రజలు బయటకు రాకుండా ఉండడమే శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

