సిటీ అవార్డుల రేసులో ‘రామగుండం’
ప్రతిష్టాత్మక జాతీయస్థాయి సిటీ అవార్డుల రేసులో రా మగుండం కార్పొరేషన్ దూసుకెళ్తున్నది.
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో భాగంగా పౌరుల అవగాహన సర్వే
- ఆన్లైన్లో ఇప్పటికే 1500 మంది ఫీడ్ బ్యాక్
- డిసెంబర్ 23 వరకు గడువు
కోల్‌సిటీ, నవంబర్ 23: ప్రతిష్టాత్మక జాతీయస్థాయి సిటీ అవార్డుల రేసులో రా మగుండం కార్పొరేషన్ దూసుకెళ్తున్నది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాల సూచికగా ఉన్న ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2022లో భాగంగా కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరుల అవగాహన సర్వే చేపట్టింది. అర్బన్ ఔట్ కమ్స్ ఫ్రేమ్ వర్క్-2022లో భాగమైన నగరాల్లో నగర స్థాయి కార్యక లాపాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించి వారిని భాగస్వాములను చేయడమే ఈ సర్వే లక్ష్యం.
దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాల్లో సుమారు 20 లక్షల మంది పౌరులను భాగస్వాములను చేసేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో రామగుండం కూడా ఉండడం విశేషం. ఇందులో నగర ప్రజలు చురుకుగా పాల్గొనేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం నుంచి రామగుండం బల్దియాకు ఆదేశాలు అందిన ట్లు అధికారులు తెలిపారు. అర్బన్ అవుట్ కమ్స్ ప్రేమ్ వర్క్-2022లో రామగుండం నగర పాలక సంస్థ నోడల్ అధికారిగా డిప్యూటీ కమిషనర్ నారాయణరావు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రజల్లో అవగాహన పెంపొందించే దిశగా కార్యక్రమాల్లో మంచి పనితీరు చూపే నగరాలకు ర్యాంకు లు ప్రకటిస్తారు. కాగా, బిల్ బోర్డులు, హోర్డింగ్స్, బ్యానర్లకు 10 మార్కులు, వాల్ పోస్టర్లకు 20, ర్యాలీలు, మాస్ క్యాంపెయినింగ్‌కు 10, పౌరుల ఆన్లైన్ సర్వేకు 20, పత్రికల్లో ప్రచారానికి 10, సో షల్ మీడియాలో ప్రచారానికి 10, రెడియో జింగిల్స్ బ్యాడ్జిలు ధరించడం లాంటి ప్రచారానికి 20 మార్కులు కేటాయిస్తారు.
ఈ అంశాల్లో మం చి పనితీరు చూపిన పట్టణ స్థానిక సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నారు. నగర పాలక సంస్థ చేపడుతున్న ప్రచార కార్యక్రమాలకు సంబంధించి నిత్యం నివేదిక పంపించాల్సి ఉంటుంది. కాగా, రామగుండానికి సంబంధించి ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్, నోడల్ అధికారి నారాయణరావు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు బల్దియాకు రూ.3 లక్షలు కేటాయిస్తూ ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలిపిందని వెల్లడించారు. నగరవాసులు http://eol2022. org/ citizen feedback%2c లింక్ ఓపెన్ చేసి సర్వేలో పాల్గొనాలని ఆయన కోరారు.
డిసెంబర్ 23తో గడువు ముగి యనుండగా కేంద్రం మార్గదర్శకాల ప్ర కారం నగర జనాభాలో కనీసం ఒక శాతం కం టే ఎక్కువ మంది ఈ సర్వే ఫీడ్ బ్యాక్‌లో పా ల్గొంటారని అంచనా. కాగా రామగుండం పౌరుల నుంచి ఆశించిన స్పందన వస్తున్నది. ఇప్పటికీ సుమారు 1500 మంది రామగుండం పౌరులు ఆన్లైన్లో ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. మిగిలిన వారు కూడా ఫీడ్ బ్యాక్ ఇచ్చి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధనకు సహకరించాలని మేయర్ అనిల్‌కుమార్, కమిషనర్ సుమన్‌రావు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

