Heart attack | కోల్ సిటీ, అక్టోబర్ 25: రామగుండం నగర పాలక సంస్థలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సుదర్శన్ (52) గుండెపోటుతో అకాల మృతి చెందారు. సీనియర్ బిల్ కలెక్టర్ గా విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న సుదర్శన్ కు రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.
కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రెండు రోజుల క్రితం ఎప్పటిలాగే విధులకు హాజరై ఇంటికి వెళ్లిన సుదర్శన్ హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన సంఘటనతో తోటి బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.