Ramagiri | రామగిరి, మే 29 : రామగిరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్కా రామకిషన్రావును హైదరాబాద్లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా అభినందించారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విమాన ప్రయాణానికి తీసుకెళ్లడం, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను ప్రశంసించారు.
గత రెండు సంవత్సరాలుగా పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నందుకు ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తూ ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలను సందర్శిస్తానని తెలిపారు. అనంతరం జిల్లా విద్యాధికారి శారద, ఏఎంఓ పీఎం షేక్ తదితరులు రామకిషన్రావును అభినందించారు.