Dharmaramam | ధర్మారంలో ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు
ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి128 వ జయంతిని శనివారం కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.
Dharmaramam | ధర్మారం, ఫిబ్రవరి 7 : ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి128 వ జయంతిని శనివారం కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి రమాబాయి చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ మాట్లాడుతూ మాత రమాబాయి కి అంబేద్కర్ తో బాల్యంలోనే వివాహం జరిగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ బిఆర్ అంబేద్కర్ తో కలిసి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న గొప్ప ఆదర్శవాది అని అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని రచించి గొప్ప మహోన్నతుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఆయన సతీమణిగా రమాబాయి సాధారణ జీవితం గడిపారని ఈ సందర్భంగా స్వామి కొనియాడారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు దాగేటి కొమురయ్య, ఏఎంసీ డైరెక్టర్ కాంపల్లి రాజేశం, దళిత రత్న అంబేద్కర్ అవార్డు గ్రహీత దేవి రాజలింగం, నాయకులు బొల్లి నందయ్య, మద్దునాల రాజమల్లు, సుంచు మల్లేశం, జేరిపోతుల నరసయ్య, పాలకుర్తి లక్ష్మణ్ గౌడ్, బత్తిని సాగర్, ఐలేని శ్యామ్, మండిగం గోపీచంద్, బోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

