DCP Ram Reddy | వీర్నపల్లి, నవంబర్ 21 : వీర్నపల్లి మండలం సీతారంనాయక్ తండాకు చెందిన భూక్యా రాంరెడ్డి (ఐపీఎస్) పెద్దపల్లి డీసీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ సీఐడీ ఎస్పీగా పనిచేస్తున్న రాంరెడ్డిని పెద్దపల్లికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి డీసీపీగా రాంరెడ్డి నియామకం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.