Chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 01: చిగురుమామిడి సెర్ప్ ఏపీఎం గా మండల రజిత శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కరీంనగర్ డీఆర్డీవో పీడీ శ్రీధర్ కు జాయినింగ్ నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు. రజిత నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి లో ఏపీఎంగా విధులు నిర్వహించి బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఏపీఎం మట్టెల సంపత్ చొప్పదండి ఏపీఎంగా బదిలీపై వెళ్లారు.
మహిళా సంఘాల బలోపితం, మహిళల ఆర్థిక అభివృద్ధి, పొదుపులు, శ్రీనిధి రుణాలు, మొదలగు వాటిపై మహిళలను చైతన్యవంతం చేస్తానని నూతనంగా నియామకమైన ఏపీఎం రజిత తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పది సంవత్సరాల తర్వాత చేపట్టిన బదిలీలలో భాగంగా, మరో 15 రోజుల్లో కమ్యూనిటీ కోఆర్డినేటర్ (సీసీ)ల బదిలీలు కానున్నట్లు సమాచారం.