Rasamayi Balakishan | రాజేందర్రెడ్డి ఆత్మహత్య కాదు.. హత్య.. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి
మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి మృతి చెందడం బాధాకరమని, ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
- మురళీధర్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వీడియో రిలీజ్ చేసిన రసమయి బాలకిషన్
Rasamayi Balakishan | తిమ్మాపూర్, జూలై 23 : మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి మృతి చెందడం బాధాకరమని, ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. అమెరికాలో ఉన్న ఆయన వీడియో రిలీజ్ చేశారు. తనతోపాటు ఉన్నప్పుడు సర్పంచ్ గా గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేశారని, చెప్పుడు మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన పాపానికి ప్రాణాలు తీశారని దుయ్యబట్టారు.
గ్రామాభివృద్ధి పై ప్రశ్నించినందుకు అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే కవంపల్లి పీఏ మురళీధర్ రెడ్డి కక్ష గట్టి వడ్లూరు గ్రామానికి చెందిన ఇద్దరిని ఎగదోసి కొట్టించే ప్రయత్నం చేసి తిరిగి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారని ఆరోపించారు. ఈ అరాచకాల గురించి తెలిపేందుకు క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళిన రాజేందర్ రెడ్డి కి ఎమ్మెల్యే నుండి సరైన స్పందన రాకపోవడంతోనే ఆత్మహత్యయత్నం చేసుకున్నాడని ఆరోపించారు. అప్పటికి కూడా ఎమ్మెల్యే ఆయనను అవమానకరంగా మాట్లాడాడని చెప్పారు. నియోజకవర్గంలో జరిగే అరాచకాలను ప్రశ్నిస్తే ఇంకా ఎంతమందిని చంపుతావని ప్రశ్నించారు.
రాజేందర్ రెడ్డి మృతికి కారణమైన మురళీధర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. రాజేందర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని, వారి చిన్నపిల్లలకు న్యాయం చేయాలని, వారి కుటుంబానికి న్యాయం జరగపోతే బీఆర్ఎస్ పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

