వేములవాడ, జూన్ 2: వెనకబడిన తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడే మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై జెండాను బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆవిష్కరించి మాట్లాడారు.
కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటంలో భాగంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణను పదేళ్లు అనేక అభివృద్ధి రంగాల్లో ముందుంచి దేశంలోనే రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే రాష్ట్రా ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు గోస్కుల రవి, సహకార సంఘం అధ్యక్షులు ఏనుగు తిరుపతిరెడ్డి, సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, మాజీ జెడ్పిటిసి మ్యాకల రవి, నాయకులు మనోహర్ రెడ్డి, ఆర్సీ రావు, రామతీర్థపు రాజు, నిమ్మ శెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, హనుమాన్లు, నీలం శేఖర్, వెంకట్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, చేపూరి రవి , ఈర్లపల్లి రాజు, వాసాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.