రాజన్న-సిరిసిల్ల: వేములవాడకు చెందిన ఒక వ్యక్తి ఇటలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది. బంధు, మిత్రులతోపాటు స్థానిక రాజకీయ నేతలు ఈ జంటను ఆశీర్వదించారు. వేములవాడలోని సాయినగర్‌కు చెందిన ఒలిమినేని శ్రీకర్ రావు ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లాడు. అక్కడ ఎంబీబీఎస్ విద్యార్థిని ఫెడెరికతో అతడికి స్నేహం ఏర్పడింది. ఇది వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించారు. దీనికి వారి తల్లిదండ్రులు అంగీకారం తెలిపారు.
కాగా, ఏప్రిల్ 30న రాత్రివేళ వేములవాడలో శ్రీకర్ రావు, ఫెడెరికకు వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు నిర్వహించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి నిరంజన్ రావు తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ జంటను వారు ఆశీర్వదించారు.