సిరిసిల్ల రూరల్, మార్చి 21: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగాగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి.గీతేను జిల్లా పోలీసు కార్యాలయంలో TUWJ( H -143) జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా, TEMJU జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో కలిసి పనిచేద్దామని, తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులపై ఏదైనా ఫిర్యాదులు వస్తే, పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. దీనికి ఎస్పీ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.