ఎల్లారెడ్డిపేట, ఆగష్టు 5: కుక్క అడ్డుగా వచ్చిందని సడెన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడి ఓ విద్యార్థి తీవ్ర గాయాలైన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివారాల ప్రకారం.. మండల కేంద్రంలోని విజ్ఞాన్, శ్రీ చైతన్య పాఠశాల్లో చదువుతున్న బొప్పాపూర్, గొల్లపల్లి కి చెందిన 9 మంది విద్యార్థులను ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కించుకొని బయలు దేరాడు.
ఎల్లారెడ్డిపేట శివారులోని గాయత్రి డిగ్రీ కళాశాల సమీపానికి చేరుకోగానే ఆకస్మాత్తుగా కుక్క అడ్డుగా వచ్చింది.
దీంతో కంగు తిన్న ఆటో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. ఇందులో అర్షద్ అనే విద్యార్థికి తీవ్ర గాయ్యాలయ్యాయి మిగతా విద్యార్థులు వైభవ్, నందిని, శరణ్య, వాజీద్, కుశల్, రాజేశ్వర్, కైఫ్ స్వల్ప గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం మండల కేంద్రం లోని అశ్విని హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.