రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో వీధి కుక్కలు(Stray dog )స్వైర విహారం చేశాయి. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న జీవన్ (9) సంవత్సరాల బాలులపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన చుట్టుపక్కల వారు కుక్కల నుంచి బాలుని రక్షించి వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు కాలనీవాసులు మాట్లాడుతూ.. కుక్కలు రోడ్లపై గల్లీలలో గుంపులు గుంపులుగా తిరుగుతూ చిన్నారులు, పెద్దలపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, కుక్కల బెడదతో ప్రజలు ఇంట్లో నుండి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. వెంటనే సంబంధిత వ్యక్తులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.