Siricilla | జిల్లా కేంద్రం సిరిసిల్ల పట్టణంలోని విజ్ఞాన వర్ధిని హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 2005-2006 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని పట్టణంలోని లహరీ గ్రాండ్ ఫంక్షన్ హాలులో ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ వివిధ హోదాల్లో స్థిరపడిన వారంతా మరోసారి తాము చదివిన బడిలో కలుసుకొని ఆ పాత మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా వారు తమ పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించారు.