Sircilla | సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 3: సిరిసిల్ల నెహ్రూనగర్‌లోని అంబ భవాని ఆలయ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు నూతన కమిటీని శివాజీ యోజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు. ఆలయ అధ్యక్షులు చిలుక నారాయణ, గాజుల భాస్కర్, తాటి వెంకన్నల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.
అధ్యక్షుడిగా కట్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శిగా బూర భాస్కర్ (బాబీ), ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా ఎలిగేటి రామానుజం, కోశాధికారిగా దూస వేణు ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో 12 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఈ ఏడాది దేవి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేపడతామన్నారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు దూడం శ్రీనివాస్, సిరిసిల్ల రవీందర్, చిల్లగాని మల్లేశం, బూర రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.