సిరిసిల్ల రూరల్, జూలై 17: తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ పడిగెల రాజు సోదరుడు, బీఆర్ఎస్ నేత పడిగెల అనిల్ కుమార్ (44) హైదరాబాద్‌లో ప్రైవేటు దవాఖానాలో గురువారం తెల్లవారు జామున చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత నెల రోజుల క్రితం పడిగెల అనిల్ కుమార్‌కు కిడ్నీల్లో రాళ్లు రావడంతో హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో ఆపరేషన్ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో ప్రాణాపాయ స్థితికి చేరాడు. అనిల్ ఆపరేషన్ విషయాన్ని పడిగల రాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తీసుకెళ్లగా, రూ.4.50లక్షల వరకు బిల్ కట్టించి పంపించారు. యశోద దవాఖాన వైద్యుల సూచన మేరకు నెల రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పడంతో మదీనాగూడలోని అర్చన దవాఖానకు అనిల్‌ను తీసుకెళ్ళారు.
అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అనిల్‌కు సుమారు. రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులకు వెచ్చించారు. అయినప్పటికీ అనిల్ గురువారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ దవాఖానలో మృతి చెందాడు. అనిల్ మృతి చెందడంతో దవాఖాన యాజమాన్యం, వైద్యులతో అనిల్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగు చేస్తామని చెప్పి, లక్షలు తీసుకొని శవాన్ని ఇచ్చారంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనిల్‌కు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. అనిల్ మృతితో తంగళ్ళపల్లిలో విషాదం నెలకొంది.