రాజన్న సిరిసిల్ల: ఆటో బోల్తా పడిన(Auto overturns) ఘటనలో పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..వేములవాడ అర్బన్ మండలం శాభాష్ పల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘం సభ్యులు బ్యాంకు పనుల నిమిత్తం కొదురుపాక బ్యాంకుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సంకెపల్లి గ్రామం వద్ద ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 11మందికి గాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంకెపళ్లి బస్టాండ్ వద్దకు సైకిల్ పై ఎవరొ గుర్తుతెలియని వ్యక్తి ఎదురుగా రావడంతో డ్రైవర్ సైకిల్ ను తప్పించబోయే క్రమంలో ఆటో బోల్తా పడింది. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించి క్షతగాత్రులను ఏరియా హాస్పిటల్ కి తరలించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.