Sakhi Centre | సఖి కేంద్ర భవనం ప్రారంభానికి ఏర్పాట్లు చేసేలా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
Sakhi Centre | సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ‘సఖి కేంద్ర భవనం’ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ‘సఖి కేంద్ర భవనం’ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం నాడు సఖి కేంద్రం భవనాన్ని శిశు, సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సఖి కేంద్రం ద్వారా మహిళల సంక్షేమం, బాధిత మహిళలకు సేవలు అందించవచ్చని తెలిపారు. 48 లక్షల రూపాయల ప్రభుత్వ వ్యయంతో 8 గుంటల స్థలంలో నిర్మించిన సఖి కేంద్రం భవనంలో అంతర్గత పనులు మిగిలిఉంటే వాటిని వెంటనే పూర్తి చేసి, భవనం పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు.
ఆయన వెంట జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, పంచాయితీ రాజ్ ఇంజనీర్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

