సిరిసిల్ల రూరల్, ఆగస్టు 1: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లప ల్లి మండలం బద్దేనపల్లి – కేసీఆర్ నగర్ రహదారిలో ఇరువైపుల ఏర్పాటు చేసిన క్రాష్ బారియార్స్ (Road Crash Barriers) ఊడి పోతున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ హయంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మండేపల్లి శివారులో 1320 డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం (కేసీఆర్ నగర్) కోసం బద్దేనపల్లి చౌరస్తా నుంచి డబుల్ రోడ్డును నిర్మించారు. ఈ డబుల్ రోడ్‌కు ఇరువైపుల వాహనాలు అదుపు తప్పి పడిపోకుండా క్రాష్ బారియార్ లు ఏర్పాటు చేశారు.
కాగా ఈ రోడ్డు లోనే ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ వయో వృద్ధుల ఆశ్రమం ప్రాంతంలో రోడ్డు కిరువైపులా ఏర్పాటుచేసిన క్రాష్ బారియర్స్ ఊడిపోతున్నాయి. పలువురు దొంగలు సైతం బారియర్స్ ఇనుప రేకులను, నట్లను అపహరించుకుపోతున్నట్లు సమాచారం. క్రాస్ బారియర్స్ కిందనే మొక్కలు నాటారు. మొక్కలపై పడిపోవడం గమనార్హం. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.