వేములవాడ రూరల్, డిసెంబర్ 12: వేములవాడ (Vemulawada) మార్కెట్ కమిటీ చైర్మన్, వేములవాడ రూరల్ మండలం నాగయపల్లెకు చెందిన రొండి రాజుపై దుండగులు కత్తులతో దాడికిపాల్పడ్డారు. శుక్రవారం వేకువ జమున గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు యువకులు రాజుపై దాడికి యత్నించగా చేతిని తప్పించబోయి తల భాగంలో కత్తిపోటుకు గురయ్యాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను వేములవాడ ఏరియా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజును పమర్శించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.