రాజన్న సిరిసిల్ల, మే 22 ( నమస్తే తెలంగాణ) : న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మరోసారి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శుక్రవారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో కేసీఆర్ కప్ విజేతగా నిలిచిన సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టుకు ఆయన రూ.1 లక్ష అందజేశారు. ఏప్రిల్ 25న విజేతలకు కేటీఆర్ చేతుల మీదుగా బహుమతులు అందించారు.
విజేతలకు ట్రోఫీ ప్రదానం సందర్భంగా న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు విజేత జట్టుకు రూ లక్ష నగదు అందిస్తానని వేదికపైనే ప్రకటించారు. ఏప్రిల్ 25న ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో కేసీఆర్ కప్ విజేతగా నిలిచిన సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టుకు ఆయన రూ.1 లక్ష అందజేశారు. అనంతరం విజేతలకు స్వీట్లు అందించి, అభినందించారు.
తమకు నగదు ప్రోత్సాహం అందించిన రవీందర్ రావుకు డాల్ఫిన్స్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాదాబ్, క్రికెట్ టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత కంబాల మల్లారెడ్డి, డాల్ఫిన్స్ క్రికెట్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.