వికారాబాద్‌లో పట్టుబడిన డీఏపీ నకిలీదే.. తేల్చిన వ్యవసాయ అధికారులు
వికారాబాద్ జిల్లాలో పట్టుబడిన డీఏపీ నకిలీదేనని వ్యవసాయ అధికారులు తేల్చారు. పూడూర్, పరిగి, బంట్వారం, యాలాల మండలాల్లో నకిలీ డీఏపీ పట్టుబడగా పరీక్షల నిమిత్తం పోలీసులు ల్యాబ్‌కు పంపారు.
వికారాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో పట్టుబడిన డీఏపీ నకిలీదేనని వ్యవసాయ అధికారులు తేల్చారు. పూడూర్, పరిగి, బంట్వారం, యాలాల మండలాల్లో నకిలీ డీఏపీ పట్టుబడగా పరీక్షల నిమిత్తం పోలీసులు ల్యాబ్‌కు పంపారు. యాలాల, పరిగి మండలాలకు సంబంధించిన రిపోర్టులో నకిలీ డీఏపీ అని తేలింది. మిగతా రెండు మండలాలకు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉన్నది. బంకమట్టి గుళికలపై నత్రజని, భాస్వరం పూతతో ఈ నకిలీ డీఏపీని తయారు చేసినట్టు గుర్తించారు.
అస్సలు నిందితుల జాడేది?
నకిలీ డీఏపీ వ్యవహారంలో జిల్లా పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ డీఏపీని స్వాధీనం చేసుకొని పదిహేను రోజులు దాటినా ఇప్పటివరకు కేసులో ముందడుగు పడటం లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం ఓ డీలర్, ట్రాన్స్పోర్ట్ చేసిన వ్యక్తిని రిమాండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. నకిలీ దందా వెనుక అసలు నిందితులు ఎవరున్నారనే దానిపై జిల్లా పోలీసులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

