సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 6: పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తున్నారు అమాత్యుడు కేటీఆర్. ఆపరేషన్ అత్యవసరమైన ఇద్దరికి సకాలంలో ఎల్వోసీ అందించి ఆదుకున్నారు. ఈ సందర్భంగా ఆపదలో అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కు బాధిత కుటుంబాలు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపాయి.
తరుణ్ కిడ్నీ మార్పిడి కోసం రూ.4లక్షల ఎల్వోసీ
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బాలుడు లింగం తరుణ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి కిడ్నీ మార్పిడి అనివార్యం కావడంతో మంత్రి కేటీఆర్ రూ.4లక్షల ఎల్వోసీని మంజూరు చేశారు. మంజూరైన ఎల్వోసీని బుధవారం నేతలు, ప్రజాప్రతినిధులు తరుణ్ కుటుంబానికి అందించారు. అలాగే నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జిల్లెల్లకు చెందిన బర్ల పోచయ్యకు గుండె ఆపరేషన్ కోసం రూ.2లక్షల ఎల్వోసీని మం త్రి మంజూరు చేశారు. బుధవారం జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు ఎల్వోసీని బాధిత కుటుంబానికి అందజేశారు. ఇక్కడ ఎంపీపీ పడిగెల మానస, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సర్పంచ్ అనిత, టౌన్ అధ్యక్షులు జగన్, టీఆర్ఎస్ మహిళా మండలాధ్యక్షురాలు నిర్మిల, ఎంపీటీసీ అంతయ్య, ఉప సర్పంచ్ తిరుపతి, వార్డు సభ్యులు జగత్, టీఆర్ఎస్ నేతలు శోభ, శ్రీనివాస్, అనిల్, లింగం, కనకరాజు, హమీద్, అరవింద్, మల్లికార్జున్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.