హుజూరాబాద్ టౌన్, ఏప్రిల్ 25: వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు ఆదివారం 1వ డివిజన్లో విస్తృతంగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కల్పనావిజయ్ గెలుపు కోసం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బర్మావత్ యాదగిరినాయక్, తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, మక్కపెల్లి కుమార్‌యాదవ్, అపరాజ ముత్యంరాజు, టీఆర్ఎస్ హుజూరాబాద్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సీనియర్ నాయకులు గందె శ్రీనివాస్, బీఎస్ ఇమ్రాన్, అంపటి సుధీర్, చందాగాంధీ, మక్కపెల్లి రమేశ్, రాజయ్య, గుడ్డెల్గుల రవి, కోనేటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేతో కలిసి నాయకుల ప్రచారం
సైదాపూర్, ఏప్రిల్ 25: వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం 8వ డివిజన్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌తో కలిసి మండల టీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి నలుబోల సరళా సతీశ్‌కుమార్‌కు మద్దతుగా టైటర్స్ట్రీట్, కుమార్‌పల్లి, ఆర్సీ భవన్, ఏనుగుల గడ్డ, కొత్తూరు జెండా, హన్మకొండ చౌరస్తాలో ఇంటింటికీ తిరుగుతూ కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, దుద్దనపల్లి ఉప సర్పంచ్ పోతిరెడ్డి హరీశ్‌రావు, దుద్దనపల్లి ఆర్బీఎస్ గ్రామ కోఆర్డినేటర్ పరుకాల నారాయణ, నాయకులు పోలు ప్రవీణ్, నీర్ల సతీశ్, ఠాగూర్ మహిపాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
చిగురుమామిడి, ఏప్రిల్ 25: వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ ఇన్చార్జిగా ఉన్న 6వ డివిజన్లో మండలానికి చెందిన పార్టీ నాయకులు ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి మధుతో కలిసి డివిజన్లోని పరిధిలోని పుత్తూర్, లస్కర్బజార్, నయీంనగర్, కిసాన్పుర, బొక్కలగుంట ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మండల నాయకులు బొయిని శ్రీనివాస్, మిట్టపల్లి మల్లేశం, మామిడి అంజయ్య, మంకు శ్రీనివాస్‌రెడ్డి, పిట్టల శ్రీనివాస్, రాజేశ్వర్‌రెడ్డి, చెప్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.