సిరిసిల్ల రూరల్, మార్చి 21: అసెంబ్లీ ముట్టడి(Assembly siege) నేపథ్యంలో తంగళ్ళపల్లి మండలంలోని ముదిరాజ్ సంఘం నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం నేత, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ ఎంపీటీసీ కార్కబోయిన కుంటయ్య, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు తిరుపతిలను శుక్రవారం ఉదయాన్నే వారి నివాసాలకు వెళ్లి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కాగా, అరెస్ట్ అయిన ముదిరాజ్ సంఘ నేతలకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. ముదిరాజుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు మాట్లా మధు, సురభి నవీన్ రావు, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.