సిరిసిల్ల రూరల్, జూలై 28: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లిలోని (Thangallapalli) స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం
శ్రీ ఆండాళ్ అమ్మ వారి తిరు నక్షత్రం (పుట్టిన రోజు నక్షత్రం) సందర్భంగా అమ్మ వారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్ రాపెళ్లి ఆనందం, గజభీంకార్ రాజన్న, మోర లక్ష్మీ రాజం, ఆలయ పూజారులు విష్ణువర్ధన్ నరసింహా చారి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.