Mallareddy | నాలుగు దశాబ్దాలు దేశసేవలో పునరంకితమై.. పదవీ విరమణ చేసి సొంతూరికి సైనికుడు..!
Mallareddy | ఎర్రటి నిప్పుకనికల్లాంటి రాజస్థాన్ ఎడారులు.. గడ్డకట్టే చల్లటి జమ్మూ కశ్మీర్ లోయలు.. ఇలా ఎండా, వాన, చలి ఎరుగకుండా దేశ రక్షణ సేవలు అందించిన సైనికుడు ఆయన. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణ కోసం పునరంకితమైన యోధుడు ముచ్చర్ల ముద్దుబిడ్డ ఒలాద్రి మల్లారెడ్డి.
Mallareddy | ఎర్రటి నిప్పుకనికల్లాంటి రాజస్థాన్ ఎడారులు.. గడ్డకట్టే చల్లటి జమ్మూ కశ్మీర్ లోయలు.. ఇలా ఎండా, వాన, చలి ఎరుగకుండా దేశ రక్షణ సేవలు అందించిన సైనికుడు ఆయన. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణ కోసం పునరంకితమైన యోధుడు ముచ్చర్ల ముద్దుబిడ్డ ఒలాద్రి మల్లారెడ్డి. వివిధ హోదాల్లో పని చేసిన ఆయన ఆదివారం (డిసెంబర్ 31న) పదవీ విరమణ చేశారు.

సోమవారం ఆయన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్లకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా దేశ సేవలో అమూల్యమైన సేవలందించి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా గ్రామస్తులు, కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. దేశం నాకేమిచ్చిందని కాకుండా.. తాను దేశానికి ఏం చేశానన్నదే ముఖ్యమని భావించి కనీపెంచిన తల్లిదండ్రులు, కట్టుకున్న భార్యాబిడ్డలను వదిలి సైన్యంలో చేరి అమూల్యమైన సేవలు అందించారని గ్రామస్తులు కొనియాడారు.
ముచ్చర్ల గ్రామానికి చెందిన ఒలాద్రి నర్సారెడ్డి-అనసూయ దంపతులకు మల్లారెడ్డి జన్మించాడు. ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కష్టపడ్డారు. చివరకు 1983 జనవరి 30న సరిహద్దు భద్రతా దళం(BSF)లో చేరారు. రాజస్థాన్, కశ్మీర్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 39 సంవత్సరాల పాటు సైన్యంలో కొనసాగారు. ఆయన భారత్-పాక్ మధ్య 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

