వేములవాడ, ఫిబ్రవరి 27: వచ్చేనెల మార్చి మూడవ తేదీన వేములవాడలోని ప్రధాన రాజన్న, భీమేశ్వర ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మూసి వేయనున్నట్లు రాజన్న ఆల అధికారులు తెలిపారు. కేతు గస్త్ర పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మార్చి మూడో తేదీన ఉదయమే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాలను మూసివేయనున్నట్లు ఆలయ పూజారి శరత్ శర్మ తెలిపారు. మార్చ్ 3 మంగళవారం ఉదయం ప్రాత:కాల పూజ అనంతరం రాజన్న ఆలయంతో పాటు అన్ని అనుబంధ దేవాలయాలను మూసివేసి భక్తుల దర్శనాలను నిలిపివేనున్నారు.
మధ్యాహ్నం 3.30 ప్రారంభమయ్యే పాక్షిక చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. గ్రహణ సమయంలో జపాలు గ్రహణ పట్టు విడుపు స్నానాలు చేయాలని, గ్రహణము పుబ్బ, ముఖ నక్షత్ర జాతకులు సింహ కుంభ రాశి వారు గ్రహణాన్ని చూడరాదన్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం యధావిధిగా పరివార దేవతలకు పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.