“ఈ ఫొటోలో ఉన్న తల్లి కూతుళ్లు పేర్లు మేడిపల్లి నీలవ్వ, వసంత. వీరిది తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితాన్ని విధి వెక్కిరించింది. ఇంట్లో మగవారు ఎవరూ మిగల్లేరు. భర్తతోపాటు ఇద్దరు కొడుకుల్లను పొగొట్టుకున్నది నీలవ్వ. కూతురు వసంతను భర్త వదిలి వెళ్లిపోగా, ఇద్దరు కొడుకులతో వచ్చి తల్లి నీలవ్వతోనే ఉంటున్నది. చిత్రమేమిటంటే కూతురు వసంత కొడుకులు కూడా మృత్యువాత పడ్డారు. వీరి పూరి గుడిసె శిథిలమవ్వగా నిలువ నీడలేక తల్లడిల్లిపోతున్నారు. 2017 ఫిబ్రవరి 23న తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్ వీరి పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే ఆర్థిక సాయం చేసి, సొంత ఖర్చులతో ఇల్లుకట్టిస్తానని హమీనిచ్చాడు. సుమారు రూ.7లక్షలతో నీలవ్వకు మంత్రి కేటీఆర్ ఇల్లు కట్టించి, తొమ్మిది నెలల్లోనే 2017 నవంబర్ 12న స్వయంగా గృహప్రవేశం చేసి, సహపంక్తి భోజనం పెట్టి, నీలవ్వతో కలిసి భోజనం చేయడం విశేషం.
సిరిసిల్ల రూరల్, జూలై 22: మంత్రి కేటీఆర్ .. ఈ పేరు ప్రస్తుతం రాష్ట్రంతోపాటు అంతర్జాతీయంగా ప్రధానంగా ఆకర్షిస్తున్నది. తెలంగాణ సాధన కోసం అమెరికాలోని ఉన్నత ఉద్యోగం వదిలి ఉద్యమంలో పాల్గొన్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అలుపెరగని పోరాటం చేశారు. మొదటి సారిగా సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసి, ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. స్వరాష్ట్రంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న మంత్రి కేటీఆర్ దేశ, విదేశాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. వీటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆపదలో ఉన్నవారికి చేయూతనందిస్తున్నారు. సోషల్ మీడియాతోపాటు వాట్సప్ మెస్సేజ్‌లకు తక్షణమే స్పందించి ఆపద్బాంధవుడయ్యారు. పేదల గోడు తెలిసిన ఆయన, ప్రస్తుతం రాష్ట్రంతోపాటు సిరిసిల్ల నియోజకవర్గంలో పేదలకు అండగా నిలుస్తూ, పేదల గుండెల్లో గూడు కట్టుకుంటున్నాడు. ఈ రోజు మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.
నీలవ్వ కుటుంబాన్ని మృత్యువు పగపట్టింది.. వరుసగా వీరి కుటుంబంలో మగాళ్లు మృతి చెందా రు. ఎనిమిదేండ్ల వ్యవధిలో ఐదుగురు మృత్యువా త పడ్డారు. భర్తతోపాటు పాటు కొడుకులు మృతి చెందారు. వివరాల్లోకి వెలితే. తంగళ్లపల్లి మండ లం రామచంద్రపూర్‌కు చెందిన మేడిపల్లి నర్స య్య- నీలమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు సుదర్శన్, ప్రభాకర్, కూతురు వసంత ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరు వ్యవసాయ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎనిమిదేండ్ల క్రితం అనారోగ్యంతో భర్త నర్సయ్య మృ తి చెందాడు. భర్తనర్సయ్య మృతి చెందిన ఏడాదికే పెద్దకొడుకు సుదర్శన్ లివర్ క్యాన్సర్‌తో మృతి చెందాడు. కూతురు వసంతకు వివాహం జరిపించగా, భర్త వదిలి వెళ్లిపోయాడు. దీంతో తల్లి చెంత కు చేరింది. వసంతకు ఇద్దరు కొడుకులు రమేశ్, రోహిత్ ఉన్నారు. వీరిలో రోహిత్ ఐదేండ్ల క్రితం గ్రామంలోనే మురుగు కుంటలో పడి మృతి చెం దాడు. రమేశ్ సైతం రెండేళ్ల క్రితం పసిరకల బారి న పడి మృతిచెందాడు. ఇదిలా ఉండగా నీలవ్వ చిన్నకొడుకు ప్రభాకర్ (30) పై ళ్లెన ఆరు నెలలకే 2016 జూలై 29న జ్వరంబారిన పడి మృతి చెం దాడు. దీంతో నీలవ్వ, నీలవ్వ కూతురు వసంత దయనీయ పరిస్థితిలో జీవించేవారు. వీరికి కేటీఆర్ కొండంత అండగా నిలిచారు. వీరికి ఇల్లు క ట్టించడంతో ఆత్మగౌరవంగా జీవిస్తున్నారు. సొం తంగా కంకులు అమ్మకుంటూ, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. నీలవ్వ మనుమరాలు గీతాంజలిని మంత్రి చెప్పినట్లుగా చదివిపించి, పెళ్లి కూడా చేశారు.
కేటీఆర్ సార్ మాకు దేవుడయ్యాడు. సార్ సల్లంగా ఉండాలే. మా ఇంట్ల మగవారే లేరు. పెనిమిటి, ఇద్దరు కొడుకులు సచ్చిపోయిండ్రు. ఇల్లు లేక,మగ దిక్కు లేక హరిగోస పడుతున్నాం. మా గోడు విన్న కేటీఆర్సార్ ఇల్లు కట్టిస్తానని చెప్పిండు.చెప్పినట్లుగానే ఇల్లు కట్టించిండు. ఆయన జన్మాంతం రుణపడి ఉంటాం. ఆయన దయతోనే బతుకుతున్నాం. సార్ పుట్టిన రోజు మాకు పండగ రోజే. నిండు నూరేళ్ల సుఖంగా ఉండాలే.
– మేడిపల్లి నీలవ్వ, రామచంద్రపూర్
మా సిరిసిల్ల ఎమ్మెల్యేగా మళ్లీ కేటీఆర్ సార్‌ను గెలిపించుకుని ఆయనకు బర్త్ డే గిఫ్ట్ అందిస్తాం. మా పేదోళ్ల బతుకుల్లో వెలుగులు నింపిన గొప్ప నేత కేటీఆర్ సార్. పవర్‌లూం కార్మికులకు గతంలో నెలకు రూ.8 వేలు మాత్రమే వచ్చేవి. కానీ సార్ ప్రత్యేక చొరవ తీసుకొని బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పించి కార్మికులకు అండగా నిలిచారు. ప్రతి కార్మికుడు నెలకు రూ.18 నుంచి రూ.20 వేలు సంపాదిస్తూ ఆత్మగౌరవంతో బతుకుతున్నాడంటే అంది కేటీఆర్ పుణ్యమే. త్రిఫ్ట్ పథకం, యారన్ సబ్సిడీలు ఏటా పొందుతున్నా. నేతన్న బీమా కూడా రూ.5 లక్షల బాండ్‌ను తీసుకున్నా. కేటీఆర్ సార్ సల్లంగుండాలని ఆ దేవున్ని మొక్కుతున్నాం.
– అన్నల్దాస్ రాజు, పవర్‌లూం కార్మికుడు, సిరిసిల్ల(కలెక్టరేట్)
గంగాధర, జూలై 23: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను వాడ వాడలా ఘ నంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదివారం ప్రకటనలో పిలుపునిచ్చారు. దేవాలయాల్లో ప్రత్యేయ పూజలు చేయాలని, దవాఖానల్లో రోగులకు పం డ్లు పంపిణీ చేయాలని సూచించారు. గ్రామా గ్రా మాన ప్రతిబీ ఆర్ఎస్ కార్యకర్తలు మొక్కలు నాటి కేటీఆర్‌కు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నా యకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.
మాది చేనేత కుటుంబం. నా భర్త వేణు సాంచాల్లో పని చేస్తుండె. ఏడాది కింద బీమారితో చనిపోయిండు. నాకు ఇద్దరు బిడ్డలు సాహిత్య, పూజిత. నాకు బీడీలు చుట్టుడుతప్ప ఇంకేం పనిరాదు. వాళ్లను చదివించుడెట్ల అని మస్తు బాధపడ్డ. పొద్దంతా జేసినా నెలకు 2వేలు గూడ రాకపోతుండె. ఏడాదిన్నర కిందట మా గల్లీకొచ్చిన కేటీఆర్‌కు మహిళలందరం కలిసి ఏద న్న పని ఇప్పియాలని అడిగినం. పదివేల మందికి పని సూపిస్తానన్నడు. అన్నట్టే అప్పారెల్ పార్కులో మిషన్ కుట్టే పని కల్పించిండు. టెక్స్టైల్స్ పా ర్కులో ఉచితంగా కుట్టు శిక్షణ ఇప్పించిండు. పూర్తయినంక సర్టిఫికెట్ ఇచ్చింది. సర్టిఫికెట్ పట్టుకుని గోకుల్దాస్ కంపెనీకి పోతే పని ఇచ్చిన్రు. ఇ ప్పుడు నెలకు 7500 జీతం ఇస్తున్నరు. కంపెనీ బస్సులోనే తీసుకపోయి, తీసుకొస్తరు. సాంచాలు నడిపే కార్మికులకే కాదు, బీడీ కార్మికుల బతుకులకు భరోసా కల్పించిన మా దేవుడు రామన్న కలకాలం సల్లంగుండాలె.
– జడల పద్మ, నెహ్రూనగర్ (సిరిసిల్ల )
మాది సిరిసిల్ల. నా భర్త సత్తయ్య సాంచాల నడుపుతడు. మాకు ఇద్దరు బిడ్డలు పదో తరగతి చదువుతున్నరు. మా అమ్మవాళ్లది మహారాష్ట్ర. అక్కడ అందరూ బీడీలే జేత్తరు. నేను బీడీలు జేసుకుంటూ మారాఠీ సదువుకున్న. సిరిసిల్లకు వచ్చినంక గూడ అదే పనిజేసిన. తంబాకు వాసన పడకున్నా బీడీలు చేసుకుంటూ ఎల్లదీసిన. కేంద్రం బీడీ కట్టెల మీద పుర్రె గుర్తు పెట్టిందని చాలా రోజులు కంపెనీలు బంద్పడ్డయి. అప్పుడు మస్తు గోసెల్లదీసిన. ఏడాది కిందట అందరు టెక్స్టైల్స్ పార్కులో కుట్టు పని నేర్చుకున్న. అప్పారెల్ పార్కులో గ్రీన్నిడిల్ కంపెనీలో పని దొరికింది. మంచి జీతం ఇస్తున్నరు. మాయన సాంచాలపై కేటీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు నేస్తుండు. నెలకు 15వేల నుంచి 20వేలు సంపాదిస్తున్నడు. నాకు 7500 జీతం వస్తంది. మంత్రి కేటీఆర్ సారు దయవల్ల ఇద్దరం కలిసి సంపాదిస్తున్నం. మాకు చేతినిండా పనికల్పించిన కేటీఆర్ సార్ వందేళ్లు సల్లంగుండాలి. ఆయనతోనే ఎందరికో బతుకు.
– ఆడెపు ఉమారాణి, నెహ్రూనగర్ (సిరిసిల్ల)
నేను ఎంఏ ఎకానమిక్స్ చేసిన. గవర్నమెంట్ జాబ్‌కోసం ప్రిపేరవుతున్న. మా అమ్మనాన్నలకు ఇద్దరం కొడుకులం. మా అన్నయ్య కూడా ప్రభుత్వోద్యోగాల కోసం చదువుతున్నడు. నేను 2015లో డిగ్రీ పూర్తి చేసిన. అప్పుడు అగ్రహారంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల తప్ప మరేవీ లేకుండె. ఈ ప్రాంతంతో ఇంజినీరింగ్, వృత్తివిద్య చదివే అవకాశం లేకుండె. కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లి చదువాలంటే ఆర్థికంగా భారమయ్యేది. అందుకే ఎంతో మంది అటువైపు వెళ్లలేకపోయారు. తమ చదువులను మధ్యలోనే మానేశారు. కానీ, ఇప్పుడు సిరిసిల్ల ఎడ్యుకేషనల్ హబ్‌గా మారింది. ఈ ఘనత మంత్రి కేటీఆర్‌ది. అగ్రికల్చర్ పాలిట్నెకిక్, జేఎన్టీయూ ఇంజినీరింగ్, ఐటీఐ, నర్సింగ్, వైద్య కాలేజీలు ఏర్పాటైనయ్. మారుమూల ప్రాంతమైన గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది. స్థానికంగానే ఉన్నత విద్య, ఉపాధికి అవకాశాలు కల్పించి కేటీఆర్ మాగుండెల్లో నిలిచారు. దేశం గర్వించదగ్గ నాయకుడు మా పాలకుడు కావడం సిరిసిల్ల బిడ్డలుగా మే గర్విస్తం. సిరిసిల్ల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న రామన్నకు మేం ఎల్లప్పుడు రుణ పడి ఉంటం. కేటీఆర్ సారుకు బర్త్‌డే శుభాకాంక్షలు.
– సిరికొండ నవీన్, హరిదాస్‌నగర్, ఎల్లారెడ్డిపేట(తెలంగాణచౌక్)