ఇల్లంతకుంట రూరల్, మార్చి04 : సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్(Tipper )ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాకర సంఘటన ఇల్లంతకుంట మండలంలోని అనంతారం శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామానికి చెందిన నక్క శంకరయ్య(55) అనే వ్యక్తి టీవీస్ ఎక్స్ ఎల్ పై వస్తున్న క్రమంలో అనంతారం వద్ద టిప్పర్ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలోశంకరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం గుర్తు పట్టని విధంగా టిప్పర్ టైర్ల కింద నుజ్జునుజ్జయింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సిరిసిల్ల మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.