సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 13: సింగిల్ల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నేరెళ్ల సింగిల్ విండో చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్ కోరారు. ఈమేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ఎక్స్ రోడ్ లో నేరెళ్ల, జిల్లెళ్ల, చిన్నలింగపూర్ లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా తమ పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు సింగిల్ విండో సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం అధికారుల సహకారంతో కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహిస్తూ, రైతులకు మద్దతు ధర అందేలా చూస్తామన్నారు. కొనుగోలు కేంద్ర నిర్వహణకు పాలక వర్గానికి రైతులు, కూలీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు తాండ్ర రవీందర్ రావు, అబ్బాడి అనిల్ రెడ్డి, గణేష్ గౌడ్, మంద నారాయణ, పొన్నాల కిషన్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీఈవోఅజయ్, లింగారెడ్డి, రవి,శ్రీనివాస్ గౌడ్, శోభ, పాల్గొన్నారు.