Sircilla | తెలంగాణ చౌక్ : జిల్లాలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. ఇటీవల సిరిసిల్ల పట్టణంలో భూ వివాదంలో సొంత బాబాయితో పాటు తమ్ముడిపై దాడి చేసిన మరువకముందే మరో ముందే.. తాజాగా ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు చంద్రంపేటకు చెందిన కొలకాని నర్సయ్య, అంజయ్య ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా 13 గుంటల భూమి విషయంలో భూవివాదం జరుగుతోంది. కాగా, శనివారం ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానలా మారింది. నర్సయ్య పెద్దకొడుకు నాగరాజు తన బాబాయ్ అంజయ్య సోదరుడు పరుశరాములుపై కత్తితో దాడి చేశాడు. దాడిలో అంజయ్య, పర్శరాములు ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే సిరిసిల్ల ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పర్శరాములు పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.