సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 23 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల మేజర్ గ్రామపంచాయతీలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఈ నెల 14 న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దుబ్బాక రజిత భారీ మెజారిటీతో విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి ఆసరి రేణుకకు 702 ఓట్లు రాగా, దుబ్బాక రజితకు 1672 ఓట్లు రావడం విశేషం. తన ప్రత్యర్థి పై 970 ఓట్ల మెజార్టీ తో గెలుపొందడం పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం మవుతున్నాయి.
కాగా, జిల్లెల లో 2013 , 2019 లోను వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థి మాట్లా మధు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లోనూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దుబ్బాక రజిత గెలుపొందారు. సోమవారం ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె మాట్లాడారు. విజయానికి సహకరించిన కేటీఆర్ సార్, గ్రామస్తులకు, నాయకులకు సర్పంచ్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ రజిత, పాలక వర్గానికి గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.