MLA Adi Srinivas | చేతనైతే చేనేతపై జీఎస్టీని తొలగించాలి.. బండి సంజయ్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్
MLA Adi Srinivas | మరో నాలుగు నెలల్లో పదవిని కోల్పోతున్న బండి సంజయ్ (Bandi Sanjay) గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో చేనేతలకు ఏ ఒక్క రూపాయి సహకారం అందించలేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Aadi Srinivas) ఆరోపించారు.
సిరిసిల్ల : మరో నాలుగు నెలల్లో పదవిని కోల్పోతున్న బండి సంజయ్ (Bandi Sanjay) గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో చేనేతలకు ఏ ఒక్క రూపాయి సహకారం అందించలేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adi Srinivas ) ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ( Revanth reddy ) కి వస్త్ర పరిశ్రమపై బండి సంజయ్ లేఖ రాయడాన్ని తప్పుపడుతూ మీడియాతో మాట్లాడారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా సంజయ్ లేఖ ఉందని విమర్శించారు.
20 వేల మంది ఉన్న కార్మికులు ఉన్న సిరిసిల్ల ( Siricilla) ప్రాంతం నుంచి కాకతీయ టెక్ట్స్ టైల్స్ పార్క్ను వరంగల్ కు తరలించింది మీరు కాదా అని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో నేతన్నులపై భారము మోపుతుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. జీఎస్టీ ఎత్తివేయాలని తాము అనేకసార్లు ఆందోళనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ జీఎస్టీని తొలగించేందుకు ఎందుకు పనిచేయడం లేదని అన్నారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

