సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 28: వరంగల్లోని ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్లే వారిపై తేనెటీగలు దాడి చేశాయ. తంగళ్లపల్లి మండలం గోపాలరావు పల్లెకు చెందిన కడారి తిరుపతి రెడ్డి, ఎడ్ల విశాక్, అంబటి బాలయ్య, ఎడ్ల నర్సయ్య పై తేనెటీగలు దాడి చేయడంతో గాయలపాలయ్యారు. ఆదివారం మధ్యాహ్నం సభకు గ్రామం నుంచి ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. మార్గ మధ్యలో మాన కొండూరు శివారులో భోజనం చేయడానికి రహదారి పక్కనే ఓ చెట్టు సమీపంలో భోజనం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆ ప్రాంతంలో కొందరు పిల్లలు ఆటలు ఆడుతున్న వారికి కూడా భోజనం పెట్టారు. దీంతో చెట్టు పై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా లేచాయి. తేనెటీగలు లేవడంతో పరుగులు పెట్టారు. వీరిలో గోపాలరావుపల్లికి చెందిన కడారి తిరుపతి రెడ్డి, ఎడ్ల విషాక్, అంబటి మల్లయ్య, ఎడ్ల నర్సయ్య లై దాడి చేశాయి. నలుగురికి గాయాలు అవ్వగా, వీరిలో తిరుపతి రెడ్డి తీవ్రంగా గాయాలయ్యాయి. హుటాహుటిన కరీంనగర్లోని దవాఖానలో చేర్పించి చికిత్స చేయిస్తున్నామని పార్టీ నేతలు తెలిపారు.