రుద్రంగి, ఆగస్టు 9: వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో రైతులు ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలు రాత్రి అనక యూరియా కోసం పడిగాపులు కాస్తూ కష్టాలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు రైతులు ఎరువుల కొరకు పడిగాపులు కావాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు సకాలంలో ఎరువులు అందాయని, రైతులందరూ సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. కొద్ది రోజులుగా ఎరువులు కోసం గ్రామాల్లో పడిగాపులు కావలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.