వేములవాడ రూరల్ మార్చి 16 : వేములవాడ రూరల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్స్, పెన్నులను అందజేసినట్లు వేములవాడ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజీ పేట, చెక్కపల్లి, నూకలమర్రి, మర్రిపల్లి, వట్టెంలా, పాజుల్నగర్ తదితర పాఠశాలలోని దాదాపు 160 మంది విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కేటీఆర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా వేములవాడ బీఆర్ఎస్ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు సూచనతో పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు చిరు కానుకగా అందజేస్తున్నామని తెలిపారు.
గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డం హనుమాడ్లు, మాజీ సర్పంచులు ఏష తిరుపతి, కటకం మల్లేశం, పెండ్యాల తిరుపతి, జంకె శ్రీనివాసరెడ్డి, కటకం చంద్రయ్య, పండుగ తిరుపతి, తంపుల సుమన్ వెల్మ బాల్ రెడ్డి, మొగిలి దేవరాజం, లక్కే మధు, మంద శ్రీనివాస్, కొండవేని మోహన్, యూత్ లీడర్స్ పసుల అంజి, తలారి రవి, వంగ పరశురాం, తుపాకుల నరేష్, నేదురి సంతోష్, మంద వేణు, గుడిసె సుదర్శన్, రత్నాకర్ రెడ్డి, దేవరాజు, తదితరులు ఉన్నారు.