సిరిసిల్ల రూరల్, మార్చి 19: సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెన్త్ విద్యార్థులకు చిరు కానుక అందిస్తున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ (Gift a Smile) లో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి విద్యార్థులకు కేటీఆర్ పరీక్ష ప్యాడ్లు , పెన్నులు అందిస్తున్న విషయం తెలిసిందే. గత పది రోజులుగా సిరిసిల్ల నియోజకవర్గవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ మేరకు బుధవారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని 65మంది విద్యార్థులకు బీఆర్ఎస్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించరాని వారు పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుగ్గిళ్ల అంజయ్య గౌడ్, సిలివేరి నర్సయ్య, అవునూరి వెంకట్రాములు, సిలివేరి చిరంజీవి, కొక్కిరాల ఆగం రావు, శ్రీనివాస్ నక్క, ప్రేమ్, కొల్లాపూరి నరేష్, స్టెప్పి వినయ్, విన్నుబాబు తదితరులు పాల్గొన్నారు.